Wednesday, March 26, 2025
HomeNewsTelanganaనల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

నల్గొండ-వరంగల్‌-ఖమ్మం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుండి స్థానిక ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన రాజీనామాతో ఉపఎన్నిక అనివార్యం అయింది. గురువారం నుండి ఈ నెల 9వ వరకు నల్గొండ కలెక్టరేట్‌ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 10వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈ నెల 27వ తేదీన పోలింగ్‌, జూన్‌ 5వ తేదీన న ఫలితాలు వెల్లడవుతాయి.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments