తెలంగాణ ఐసెట్ 2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జి వీసీ వాకాటి కరుణలు కలిసి శుక్రవారం ఫలితాలను విడుదలచేశారు. ఫలితాలలో 91.92 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 86,156 మంది దరఖాస్తు చేసుకోగా, 71,647 మంది ఉత్తీర్ణత సాధించారు. MBA, MCA కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 5, 6 తేదీల్లో ఐసెట్-2024 ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐసెట్ ఫలితాల కోసం ఈ వెబ్ సైట్‌ను https://icet.tsche.ac.in క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.