తెలంగాణలో భారీఎత్తున ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. 20 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. సార్వత్రిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో చాలా వరకు బదిలీలు జరగలేదు. ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం పాలనపై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఒకేసారి 20 మంది కలెక్టర్లకు స్థానచలనం కలిగింది.
బదిలీ అయిన కలెక్టర్ల పోస్టింగ్ లు ఈక్రింది విధంగా ఉన్నాయి:
నారాయణపేట్ : సిక్తా పట్నాయక్
వనపర్తి : ఆదర్శ్ సురభి
సిరిసిల్ల : సందీప్ కుమార్ ఝా
భద్రాద్రి కొత్తగూడెం : జితేష్ వి.పాటిల్
వికారాబాద్ : ప్రతీక్ జైన్
కామారెడ్డి : అశిష్ సంగ్వాన్
నల్గొండ : నారాయణరెడ్డి
ఖమ్మం : ముజామిల్ ఖాన్
నాగర్ కర్నూల్ : సంతోష్
భూపాలపల్లి : రాహుల్ శర్మ
కరీంనగర్ : అనురాగ్ జయంతి
పెద్దపల్లి : కోయ శ్రీహర్ష
జగిత్యాల : సత్యప్రసాద్
మంచిర్యాల : కుమార్ దీపక్
మహబూబ్ నగర్ : విజయేంద్ర
హనుమకొండ : ప్రావీణ్య
సూర్యాపేట : తేజస్ నందలాల్ పవార్
వరంగల్ : సత్య శారదాదేవి
ములుగు : దివాకరా
నిర్మల్ : అభిలాష అభినవ్