తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా హ్యాక్ అయింది. విషయం తెలుసుకున్న గవర్నర్ కార్యాలయ అధికారులు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 15 సంక్రాంతి రోజన గుర్తు తెలియని వ్యక్తులు గవర్నర్ ట్విట్టర్ హ్యాండిల్ ను క్షహ్యాక్ చేయడంపై తమకు ఫిర్యాదు అందిందని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. అయితే అందులో హ్యాకర్లు ఎలాంటి పోస్టులు పెట్టలేదని.. త్వరలోనే సమస్యను పరిష్కరించేందుకు విచారణ ప్రారంభించామని పోలీసులు అంటున్నారు.