రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీకి పటిష్ట కార్యాచరణ, ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాలపై ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుల జారీకి సంబంధించి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ అధికారులకు పలు సూచనలు చేశారు.
దరఖాస్తుల స్వీకరణ
నూతన రేషన్ కార్డుల కోసం అక్టోబరు రెండో తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలని సీఎం సూచించారు. అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇచ్చే అంశంపై కసరత్తు చేశారు.దీనిపై త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు.