గత ప్రభుత్వంలో కీలక శాఖల్లో పనిచేన కొందరు అధికారుల అక్రమాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కేబినెట్ ఆమోదం లేకుండానే ఫార్ములాకార్ రేస్‌కు రూ.50 కోట్లు విడుదల చేసిన ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వంలో అరవింద్ కుమార్ మున్సిపల్, HMDA కమిషనర్‌గా పనిచేశారు. అప్పటి మంత్రి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా అరవింద్‌కుమార్‌కు పేరు ఉంది. రాష్ట్ర క్యాబినెట్, ఆర్థికశాఖ అనుమతులు ఏవీ లేకుండా హైదరాబాద్‌లో ఫార్ములా–ఈ రేస్ నిర్వహణకు హెచ్‌ఎండీఏ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. అంతే కాకుండా దాని నిర్వహణ కోసం రూ.54 కోట్లు ముందస్తుగా చెల్లించింది. అయితే, తాజాగా ప్రభుత్వం ఈ ఫానులా రెస్ ను రద్దు చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దుచేయటంపై ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ లీగల్ నోటీస్ ఇస్తామని ప్రకటించటంతో ఈ విషయ వెలుగులోకి వచ్చింది. దీనిపై అరవింద్ కుమార్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసులు జారీ చేశారు.