తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం దక్కింది. ఈనెల 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు మెక్సికో దేశంలోని మోంటిగ్రో నగరంలో జరగనున్న 19వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా నిర్వాహకులు ఆహ్వానించారు. “ప్రగతి కోసం శాంతి అనే” ప్రధాన అజెండాతో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ 200వ వేడుకలో నోబెల్ బహుమతి గ్రహీతలు, ప్రపంచ శాంతి న్యాయవాదుల సామూహిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆహ్వానంలో తెలిపారు. ఒత్తిడితో కూడిన ప్రపంచ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ, వ్యూహాలను ఈ శిఖరాగ్ర సమావేశంలో రూపొందిస్తామని ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎం భట్టికి అరుదైన గౌరవం.. నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం
RELATED ARTICLES