తెలంగాణ సచివాలయం ముందు దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రభుత్వం రేపు ఏర్పాటు చేయనుంది. సోమవారం సాయంత్రం 4 గం.లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాజీవ్ విగ్రహాన్నిఆవిష్కరించనున్నారు. ఇటీవలే ప్రభుత్వం ఈ విగ్రహ ఏర్పాటుకు సంబందించి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే బీఆర్ఎస్ పార్టీ అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహానికి బదులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.