తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సోమవారం విజయవాడకు వెళ్లనున్నారు. విజయవాడలో జరిగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YSR)75వ జయంతి వేడుకలలో పాల్గొంటారు. ముఖ్యమంతితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు హాజరవుతారు. వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో జరిగే వైఎస్ఆర్ జయంతి వేడుకలకు హాజరు కావాలని ఇప్పటికే వైఎస్ షర్మిల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులను కలిసి ఆహ్వానించారు.