ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రాష్ట్ర ముఖ్యమంత్రి రేంవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రధానిని కలవడం ఇదే మొదటిసారి. రాష్ట్రానికి రావలసిన నిధులు, ఇతర పెండింగ్ అంశాలపై చర్చించారు. దాదాపు గంటపాటు ఈసమావేశం కొనసాగింది. ముఖ్యంగా విభజన హామీలు, ఇతర అభివృద్ది పనులకు నిధుల మంజూరుకు రాష్ట్రానికి సహకరించాలని ప్రధాని మోడీని కోరారు.