Ration Card: రేషన్ కార్డు అర్హతలు ఇవే.. ప్రభుత్వం కీలక ప్రకటన

తెలంగాణలో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డుల మంజూరీ ఉంటుందని మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది. అయితే అందుకు సంబందించి విధి విధానాలను పరిశీలిస్తున్నట్లు మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు నిర్ణయించారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో కొత్త తెల్ల రేషన్ కార్డుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన మంత్రివర్గ ఉప సంఘము సమావేశమై రేషన్ కార్డు మంజూరీ పై నిశితంగా చర్చించారు. మంత్రి వర్గ ఉపసంఘం చైర్మన్ రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులు రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి దామోదరరాజ నరసింహా, రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పౌర సరఫరాల కార్యదర్శి డి.యస్ చౌహన్, ఆరోగ్య శాఖా కార్యదర్శి చిరిస్తినాజ్ చొంగతి తదితరులు పాల్గొన్నారు.

తెల్ల రేషన్ కార్డుకు గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం లక్షన్నర కు లోపు ఆదాయం, మాగాణి (నీటి ఆధారిత పంటలు) 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు.. పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలు మించకుండా ఉండాలన్న ప్రతిపాదన ఉపసంఘము ముందుకు వచ్చిందన్నారు. కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారెవరూ ఈ అవకాశం కోల్పోకోకుండా ఉండేలా లోతైన అధ్యయనం జరుపుతున్నామని అన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా అధికార, ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులందరి నుండి కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో వారి సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు ఉపసంఘము చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

తక్షణమే రాజ్యసభ, లోకసభ,శాసనసభ, శాసనమండలి సభ్యులందరికీ లేఖలు రాసి విధి విధినాలలో వారి నుండి సూచనలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ కార్యదర్శి డి.యస్ చౌహన్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. అంతే గాకుండా డాక్టర్ ఎన్.సి.సక్షేనా కమిషనర్ గా ఉన్న సక్సేనా కమిటీ సిఫారసులను కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో పరిగణనలోకి తీసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కమిటీలో సుప్రీంకోర్టు స్పెషల్ కమిషనర్ హర్ష మండర్ సభ్యుడిగా ఉన్నారు. అంతే గాకుండా రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు దిగువ పేద మధ్యతరగతి ప్రజలకు మంజూరు చేసునున్న తెల్ల రేషన్ కార్డుల మంజూరీ విషయంలో అధికారుల బృందం ఇప్పటికే దేశంలోని మిగితా రాష్ట్రాలలో తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో అవలంబిస్తున్న విధి విధానాలను అధ్యయనం చేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే అదే సమయంలో అంతర్ రాష్ట్రాల నుండి తెలంగాణకు వలస వచ్చిన వారికి అక్కడ ఇక్కడ రెండు చోట్లా తెల్లకార్డులు ఉన్నట్లు తేలిందని.. అటువంటి వారికి అక్కడో, ఇక్కడో అన్న అప్షన్ ఇవ్వాలనే ప్రతిపాదనపై ఉపసంఘము చర్చించింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం అధికారం లోకి వచ్చిందే తడవుగా కొత్త తెల్ల రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఇవ్వడంతో పది లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

Topics

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img