తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి, ఆరు గ్యారెంటీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. ప్రజలకు అన్యాయం చేసిందని.. వెంటనే ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రైతు దీక్షకు దిగారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 11 గం. నుండి సాయంత్రం 5 గం. వరకు ఈ దీక్ష కొనసాగనుంది.
బీజేపీ ప్రధాన డిమాండ్లుః.
2 లక్షల లోపు రైతుల బ్యాంకు రుణాలను మాఫీ చేయాలి
వడ్లకు క్వింటాల్ కు రూ.500 బోనస్ తక్షణమే అమలు చేయాలి
కరువు వల్ల నష్టపోయిన రైతులకు రూ. 25వేల నష్టపరిహారాన్ని చెల్లించాలి
రైతు భరోసా ద్వారా రూ. 15వేల రూపాయలను రైతులకు అందించాలి
రైతు కూలీలకు రూ.12000 బ్యాంక్ అంకౌట్ లో జమ చేయాలి