తెలంగాణ ఆత్మ స్టాఫ్ అసోసియేషన్ యూనియన్ డైరీని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఎమ్మెల్సీ కోదండరాం చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఉద్యోగులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆత్మ ఎంప్లాయిస్ గత 12 సంవత్సరాలుగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నామని.. తమకు ఉద్యోగ భద్రత లేదని ఉద్యోగులు మంత్రికి తెలిపారు. తమకు ఇంక్రిమెంట్ గాని, పిఆర్సి గాని ఇవ్వడం లేదని అన్నారు. ఆత్మ ఎంప్లాయిస్ ను మణిపూర్, సిక్కిం రాష్ట్రాలలో ప్రభుత్వంలో విలీనం చేసుకున్న మాదిరిగా తమను కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసయ మరియు అనుబంధ శాకల్లో పనిచేస్తున్న ఆత్మ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ సెక్షన్ అధికారులతో పాటు తెలంగాణ ఆత్మ స్టాప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అదావత్ కృష్ణ నాయక్, జనరల్ సెక్రటరీ ఎం.సురేందర్ రెడ్డి, ట్రెజరర్ జ్యోతిలక్ష్మి, వైస్ ప్రెసిడెంట్ అపర్ణ రెడ్డి, సాయి చరణ్ , రవీందర్, వినోద్, స్పందన, జయంతి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.



