తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. ఆతరువాత సభను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఈరోజు సభలో అధికార, ప్రతిపక్షాల మద్య మాటల యుద్దం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ మద్య విమర్శలు, ప్రతివిమర్శలు జరిగాయి.