తెలంగాణతోసహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో త్వరలో జరిగబోయే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్ ను మీడియా కు వివరించారు. తెలంగాణలో నవంబర్ 30 న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3న వెలువడనుంది. తక్షణమే ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చినట్లే అని భారత ఎన్నికల ప్రధాన అధికారి పేర్కొన్నారు.