రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)ను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఈ విలీన ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రభుత్వం బిల్లును గవర్నర్ సంతకం కోసం రాజ్ భవన్ కు పంపించిన విషయం తెలిసిందే. అయితే, ఈ బిల్లులోని కొన్ని అంశాలపై మరింత స్పష్టత ఇవ్వాలంటూ గవర్నర్ తమిళిసై ప్రభుత్వాన్ని వివరణ కోరారు. కేవలం ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వంలో విలీనం అవుతారని, కానీ ఆర్టీసీ సంస్థ అలాగే కొనసాగుతుందని ప్రభుత్వం గవర్నర్ కి వివరణ ఇచ్చింది. దీనిపై మరోమారు గవర్నర్ కొన్ని విషయాలపై స్పష్టత కావాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈరోజు ఆర్టీసీ ఉన్నతాధికారులతో గవర్నర్ భేటీ కానున్నారు. ఆ తరువాతే ఈ బిల్లుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.