ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించింది. కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మూంజూరు చేసింది. ఆమె పిటిషన్ పై విచారించిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టడం జరిగింది. ముకుల్ రోహత్గీ కవిత తరపున వాదనలు వినిపించగా.. ఏఎస్ జీ ఈడీ తరపున వాదనలు వినిపించారు. ఇద్దరి వాదనలు విన్న న్యాయస్థానం కవితకు బెయిల్ మంజూరు చేసంది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో కవితకు బెయిల్ వచ్చింది. ఎమ్మెల్సీ కవితను గత సంవత్సరం మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. అప్పటినుండి తీహార్ జైలులు కవిత ఉన్నారు.