భారత రాష్ట్ర సమితి ఎన్నికల ప్రచార ఖర్చులకోసం తన వంతుగా తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత్ ఆచారి తల్లి శంకరమ్మ లక్ష రూపాయల చెక్కును భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు కి అందించారు. ఈరోజు హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ ని, మంత్రి జగదీశ్ రెడ్డి తో కలిసి లక్ష రూపాయల చెక్కును పార్టీకి శంకరమ్మ అందించారు. ఈసారి తిరిగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శంకరమ్మను మరింత గౌరవప్రదమైన స్థానంలో నిలిపే బాధ్యతను తాను స్వయంగా తీసుకుంటానని ఈ సందర్భంగా కేటీఆర్ శంకరమ్మకు తెలియజేశారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన అమరవీరుల ఆశయాల సాధన కోసం మరోసారి మన పార్టీ గెలవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా కేటీఆర్ కి శంకరమ్మ తెలిపారు.