అమెరికా నుంచి వచ్చి అమ్మను బ్రతికించుకున్న అన్నదమ్ములు
వీరి స్వస్థలం.. బద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ మండలం లోని ఇరవెండి గ్రామం.. అమెరికాలో టాప్10 డాక్టర్స్ లో ఒకరైన రాజా శ్రీనివాస్, తానా మాజీ అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్ అన్నదమ్ములు..తల్లి కోసం కోట్ల రూపాయల ఆదాయం వదులుకొని 60 రోజులకు పైగా హైదరాబాద్ లోని ప్రముఖ హాస్పిటల్ AIG లో కొన ఊపిరితో ఉన్న తమ తల్లితో పాటు ICU లో ఉండి తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటూ జన్మనిచ్చిన అమ్మను బ్రతికించుకున్నారు ఈ అన్నదమ్ములు..ఈ భూమి మీద జన్మ నిచ్చిన తల్లిదండ్రులను మించిన ఆస్తి, తల్లిదండ్రులను మించిన దైవం లేదు అని నేటి సమాజానికి, నేటి యువతకు తెలియజేసిన వీరిని ఎంత పొగిడినా తక్కువే.. నేటి తరానికి ఆదర్శ మూర్తులుగా నిలిచిన మీకు అభినందన నమః సుమాంజలులు.