తెలంగాణలో మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుంది. సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు భావోద్వేగ సందేశాన్ని పంపారు. ప్రియమైన సోదర సోదరీ మనులారా.. అంటూ తన సందేశాన్ని ప్రారంభించారు. తెలంగాణ అమరవీరుల స్వప్నాలు తాను చూడాలనుకుంటున్నానని తెలిపారు. దొరల తెలంగాణను ప్రజల తెలంగాణగా చూడాలని అనుకుంటున్ననని అన్నారు. తనను సోనియమ్మా అని పిలిచి గౌరవం ఇచ్చారని గర్తు చేశారు. తెలంగాణలో మార్పు కోసం కాంగ్రెస్ కు ఓటు వేయాలని తన సందేశంలో కోరారు.
"దొరల తెలంగాణ పోవాలి, ప్రజల తెలంగాణ రావాలి.
— Telangana Congress (@INCTelangana) November 28, 2023
మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి."
తెలంగాణ ప్రజలకు తల్లి సోనియమ్మ సందేశం. pic.twitter.com/UY93jCEBMF