తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్స శుభాకాంక్షలను కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలియజేశారు. అమరవీరులకు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ 2004లో కరీంనగర్ లో హామీ ఇచ్చినట్లుగా.. ఇచ్చిన మాట నెరవేర్చామని అన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ఆరు గ్యారంటీలను నెరవేరేస్తామని సోనియా గాందీ వీడియో సందేశంలో వివరించారు.