రైతన్న రాజ్యస్థాపన కోసం ఎంపీ ఎన్నికల్లో పోటీకి దిగానని రైతుబిడ్డ సిరాజ్ తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా షేక్ సిరాజుద్దీన్ మంగళవారం రోజున నామినేషన్ దాఖలు చేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటుకు నోటు ఇవ్వలేని పరిస్థితి తనది అని తెలిపారు. కనీసం గిఫ్ట్ లు, బిర్యానీలు, చుక్క, ముక్క ఇచ్చే స్థోమత తనకు లేదన్నారు. ఓటు కంటే నోటు ఫవర్ ఫుల్ గా తయారైందన్నారు. ఖమ్మం జిల్లా నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం రోజున సిరాజ్ నామినేషన్ దాఖలు చేశారు.
రైతుల ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయని చెప్పారు. వ్యవసాయం అంతరించే ప్రమాదంలో పడిందన్నారు. నేలను నమ్ముకున్న రైతన్నకు మన దేశంలో స్వతంత్రం ఇంకా రాలేదు అని అన్నారు. రైతన్న పేరు చెప్పి రాజకీయం చేసినోడికి పదవులోస్తున్నాయి. రైతన్నపేరుతో సినిమాలు తీసినోడికేమో కోట్లు, హిట్లు వస్తున్నాయి. కానీ, నిజమైన రైతన్నలు వ్యవసాయం చేస్తుంటే అప్పులు ఎందుకు వస్తున్నాయి. ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి అని ప్రశ్నించారు. మార్పు కోసం.. ఈ వ్యవస్థను మార్చడం కోసం తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. కొత్త మార్పు రావాలన్నా.. రైతన్న రాజ్యం రావాలన్నా.. తనకు ఓటేస్తే అభివృద్ధికి ఓటు వేసినట్టు అని అన్నారు.. తన గెలుపు రైతన్న రాజ్యానికి మొదటి మొట్టు అని సిరాజ్ అన్నారు.