సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలం నకిరేకొమ్ముల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన బి. ఆర్యన్ రోషన్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల – కోహెడలో చదివి పదవ తరగతిలో 10/10 జిపిఎని సాధించారు. అలాగే ఎంతో కష్టపడి చదివి ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థ ఐఐటీ తిరుపతిలో కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో సీటు సంపాధించిన అతనికి ఐఐటీలో చేరేందుకు పేదరికం అడ్డు రావడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ మను చౌదరి చదువుకునేందుకు తోడ్పాటునందించారు.
శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో 40,500 విలువ చేసె ఎచ్ పి లాప్ టాప్ తో పాటు ఐఐటి ఫస్ట్ సెమిస్టర్ పీజు 36,750/- లను చెక్కు రూపేనా జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగవాల్ తో కలిసి ఆర్యన్ రోషన్ కి అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతు…. బి.ఆర్యన్ రోషన్ తండ్రి తన చిన్నతనంలోనే మరణించినా తల్లి రాజమణి రోజు కూలి చేసి తనను చదివించగా పట్టుదలతో చదివి ఐఐటిలో సీటు పొందినందుకు అభినందనలు తెలుపుతూ.. ఇలాగే ఐఐటి పూర్తి చేసుకోని అత్యున్నత శిఖరాలు అధిరోహించి చదువుకోవాలనే ఆసక్తిగల నీలాంటి నిరుపేదలకు ప్రతి ఒక్కరికి స్పూర్తి దాయకంగా నిలవాలని ఆకాంక్షించారు.