సిద్దిపేట జిల్లా: గొర్రెలు చేను మేశాయనే అనుమానంతో చేర్యాల మండలం రాంపూరం గ్రామానికి చెందిన చెట్టె సత్తయ్యను మద్దూరు మండలం నర్సాయపల్లికి చెందిన పోతుగంటి రమేష్ విపరీతంగా కొట్టాడు. నార్సాయపల్లి గ్రామం సమీపంలో చెట్టె సత్తయ్య గొర్రెలు మేపుకుంటుండగా.. అటువైపు రమేష్ అనే వ్యక్తి వచ్చి నా చేను ఎవరో పశువులతో మేపారు. నువ్వే మేపావు.. అని చేతిలో ఉన్న పెద్ద కర్రతో విపరీతంగా కొట్టాడు. పొలం నా పశువులు మేయలేదు.. అని సత్తయ్య ఎంత మొత్తుకున్నా వినకుండా రెండు కర్రలు విరిగేలా… బూతులు తిట్టుకుంటూ కొట్టాడు. పక్కనే ఉన్న చెట్టె సత్తయ్య తండ్రి చెట్టె యాదయ్య అడ్డుకో బోతే ఆయనను కూడా కొట్టాడు. తీవ్రగాయాలతో సత్తయ్య ఆసుపత్రిలో చకిత్స పొందుతున్నాడు. అకారణంగా తనను పోతుగంటి రమేష్ కొట్టాడని … కాళ్ళావేళ్ళా పడ్డా వినలేదని.. అతనిపై చర్య తీసుకోవాలని చేర్యాల పోలీసులకు సత్తయ్య ఫిర్యాదు చేశాడు. అకారణంగా గొర్రెల కాపరిని కొట్టిన వ్యక్తిపై చర్య తీసుకోవాలని.. అతన్ని అరెస్ట్ చేసి, సత్తయ్యకు న్యాయం చేయాలని కురుమ సంఘం నాయకులు, గొర్రెల కాపరులు కోరుతున్నారు.