తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (secunderabad railway station) రైల్వేల ఆదాయంలో నాలుగో స్థానంలో నిలిచింది. 2023-24 సంవత్సరానికి గాను ఎక్కువ ఆదాయం ఆర్జించిన రైల్వే స్టేషన్ల జాబితాను రైల్వే శాఖ ప్రకటించింది. న్యూఢిల్లీ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో హౌరా, మూడో స్థానంలో చెన్నై ఉన్నాయి. న్యూఢిల్లీ స్టేషన్ నుంచి రూ. 3,337 కోట్ల ఆదాయం, హౌరా స్టేషన్ నుంచి రూ. 1,692 కోట్లు, చైన్నై సెంట్రల్ నుంచి రూ. 1,299 కోట్లు, సికింద్రాబాద్ నుంచి రూ. 1,276 కోట్ల ఆదాయం రైల్వేశాఖకు సమకూరుతోంది.