కుత్బుల్లాపూర్ నియోజవర్గం,కొంపల్లి లోని పలు కాలనీల్లో వీధి కుక్కలు (Street Dogs) స్వైర విహారం చేస్తూ దొరికిన వాళ్ళని వేటాడుతున్నాయి. ఎన్ని సార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని, కొంపల్లి మున్సిపల్ కమిషనర్, చైర్మన్ ల పై చర్యలు తీసుకోవాలని పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో పలు కాలనీలకు చెందిన చిన్నారులు ఫిర్యాదు చేశారు.
ఇంత మంది పిల్లలు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ కు రావడం చూసి అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీల్లో ప్రజలు బైటికి రానంత గా కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, వాటి బారీ నుండి తమకు రక్షణ కల్పించాలని ఎన్నో సార్లు మున్సిపల్ అధికారులకు తెలిపినా, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా అలసత్వం వహిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి అధికారుల పై చర్యలు తీసుకోవాలని, సిఎం రేవంత్ రెడ్డి అంకుల్, కమిషనర్ అంకుల్, స్థానిక ఎమ్మెల్యే వివేక్ అంకుల్ తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని చిన్నారులు ప్లకార్డులు ప్రదర్శించారు.