తెలంగాణ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి శుక్రవారం ఆదిలాబాద్ కేంద్రానికి వస్తున్నారని, కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన మీడియా సమావేశానికి ఏర్పాట్లు చేయాలని ముందస్తు మాచారం ఇచ్చినా.. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆయనను అరగంట పాటు ఆరుబయటే నిలబడేలా చేసిన ఆదిలాబాద్ డిపిఆర్ఓ పై చర్యలు తీసుకోవాలని శనివారం జిల్లా కలెక్టర్ కు యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
ఒక రాష్ట్ర చైర్మన్ క్యాబినెట్ హోదా కలిగినటువంటి వ్యక్తిని ఆవిధంగా అవమానపరచడం సరైనది కాదని రూపేష్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ పట్ల ఆ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. డిపిఆర్ఓపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు. స్పందించిన జిల్లా కలెక్టర్ సంబంధిత అంశాన్ని సమాచార శాఖ కమిషనర్ దృష్టికి తీసుకు వెళ్తానని తెలిపారు. జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో రూపేష్ రెడ్డితో పాటు ప్రకాష్ తదితరులు ఉన్నారు.