మూసీప్రాజెక్టు (Musi prokect) మూటల లెక్కలు చెప్పేందుకే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS working president KTR) విమర్శించారు. పేదప్రజలు గూడు చెదరగొట్టేందుకు ఢిల్లీలోని తన బాసులతో మంతనాలు చేస్తున్నారని అరోపంచారు. సీఎం హస్తిన పర్యటనలతో తెలంగాణ ప్రజలకు ఏం ప్రయోజనం జరిగిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కేవలం పది నెలల కాలంలో 23 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి ప్రజలకు ఎంత మేరకు లబ్ది చేకూర్చారో తెలపాలని కేటీఆర్ అన్నారు. కనీసం సీఎం పర్యటనలకు పెట్టిన ఫ్లైట్ ఛార్జీల ఖర్చంత నిధులైనా ఈ రాష్ట్రానికి తీసుకువచ్చారా ? అని ఎద్దేవా చేశారు. అత్యధిక ర్లు ఢిల్లీ పర్యటన చేసిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.
మూసీ మూటల లెక్కలు చెప్పేందుకే ముఖ్యమంత్రి రేవంత్ హస్తిన పర్యటన
— BRS Party (@BRSparty) October 7, 2024
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
♦️పేద ప్రజల గూడు చెదరగొట్టేందుకు ఢిల్లీలో మంతనాలు చేస్తున్నారు.
♦️రాష్ట్ర పాలన గాలికి వదిలి గాలిమోటర్ ఎక్కుతున్న రేవంత్ తీరుపైన కేటీఆర్ మండిపాటు
♦️ముఖ్యమంత్రి పదే పదే ఢిల్లీ… pic.twitter.com/eumxSWyRXy