ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. ప్రగతి భవన్ ఇక జ్యోతీరావు పూలే ప్రజా భవన్

పాలకులం కాదు.. సేవకులం అని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్ధి, నిరుద్యోగ, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటుతో ఇక అంతటా సమానాభివృద్ధి సాధ్యం అన్నారు. తెలంగాణ కుటుంబ ప్రజలు ఎప్పుడు రావాలనుకున్నా… ప్రగతి భవన్ లోకి రావొచ్చు. ప్రజలు వారి ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకోవచ్చు అని పేర్కొన్నారు. జ్యోతీరావు పూలే ప్రజా భవన్ లో రేపు ప్రజాదర్బర్ నిర్వహిస్తామని ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఇవాళే స్వేచ్ఛ వచ్చిందని అన్నారు. గురువారం ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

తెలంగాణ రాష్ట్రం ఆషామాషీగా ఏర్పడ్డ రాష్ట్రం కాదని, పోరాటాలతో ఏర్పడ్డ రాష్ట్రమని, త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రమని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని 4 కోట్ల మంది జనాలకు స్వేచ్ఛ ఇవ్వాలని సామాజిక న్యాయం చేయాలని అసిఫాబాద్ నుంచి మొదలుపెడితే అలంపూర్ వరకు, ఖమ్మం నుంచి మొదలుపెడితే కొడంగల్ వరకు సమానమైన అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో సోనియా గాంధీ గారి ఉక్కు సంకల్పం, కాంగ్రెస్ పార్టీ సమిధగా మారి..ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు రేవంత్ రెడ్డి. దశాబ్దకాలంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం హత్యకులోనై, మానవ హక్కులకు భంగం కలిగి ఈ ప్రాంతంలో ప్రజలు చెప్పుకోవడానికి ప్రభుత్వం నుంచి వినేవాళ్లు లేక ప్రజలు మౌనంగా భరించారని అన్నారు. గత ప్రభుత్వం ప్రజల బాధలను పట్టించుకోలేదన్నారు. దశాబ్ద కాలపు నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడారని పేర్కొన్నారు.

“ఇందిరమ్మ రాజ్యంలో సోనియామ్మ అండతో ప్రజలకు మేలైన సంక్షేమంతో పాటు అభివృద్ధిని చూసి చూపిస్తాం. పాలకులం కాదు సేవకులం అనే విధంగా పని చేస్తాను. కాంగ్రెస్ కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకుంటాను” అని రేవంత్ రెడ్డి చెప్పారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అమరుల ఆశయ సాధనకు ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనిందన్నారు. ఇప్పటికే ప్రగతిభవన్‌ ముందు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించామన్నారు. సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చుదిద్దుతామని స్పష్టం చేశారు. మీ బిడ్డగా.. మీ సోదరుడిగా మీ బాధ్యతలను తాను నిర్వహిస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు. “ఇక్కడ ప్రమాణ స్వీకారం మొదలైనపుడే అక్కడ ప్రగతి భవన్ గడీ ఇనుప కంచెలు బద్దలు కొట్టాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నా… ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు. ఇవాళ ప్రగతి భవన్ చుట్టూ కంచెలు బద్దలు కొట్టాం. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతీరావు పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్బారు నిర్వహిస్తాం. మేం పాలకులం కాదు.. మేం సేవకులం…మీరు ఇచ్చిన అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి వినియోగిస్తాం కార్యకర్తల కష్టాన్ని, శ్రమను గుర్తు పెట్టుకుంటా.. గుండెల్లో పెట్టుకుంటా” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

తెలంగాణలో శాంతిభద్రతలు కాపాడేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా..ప్రపంచంతో పోటీపడే విధంగా తెలంగాణను అభివృద్ధి చేస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.*ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం..రజినీకి ఉద్యోగంపై రెండో సంతకం* తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్‌రెడ్డి రెండు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీల ఫైలుపైనే ఆయన తొలి సంతకం చేశారు. ఆ తర్వాత గతంలో ఇచ్చిన మాట మేరకు దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగ నియామక ఉత్తర్వులపై రెండో సంతకం చేశారు. నాంపల్లి నియోజకవర్గంలోని బోయిగూడ కమాన్‌ ప్రాంతానికి చెందిన దివ్యాంగురాలైన రజినీ కష్టపడి పీజీ వరకు చదివింది. ఉన్నత చదువు పూర్తి చేసినా ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. గతంలో గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డిని కలిసి ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని రజినీకి ప్రమాణస్వీకారానికి ఆహ్వానించిన రేవంత్‌ రెడ్డి.. ఆమెకు ఉద్యోగ నియామక పత్రాన్ని అందించారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్‌, ఇతర పార్టీలకు చెందిన ముఖ్యనేతలు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ ముఖ్యనేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.

బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్లారు. సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి వెళ్లిన ఆయనకు సీఎస్ శాంతికుమారి ఘన స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అధికారులు, పోలీసులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత సచివాలయం ఆరో ఫ్లోర్లోని ఛాంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ మతాల వేద పండితులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆశీర్వదించారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

ఖేలో ఇండియా 2026కు వేదికగా హైదరాబాద్.. కేంద్రం సుముఖం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026...

ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులు వీరే.. సీఎం రేవంత్ గుడ్ న్యూస్ !

తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు...

హైదరాబాద్ – టర్కీల మధ్య నిజాం కాలం నుండే సత్సంబందాలు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో...

మన్నెగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదు.. మంత్రి కోమటి రెడ్డి సీరియస్

రాష్ట్రంలో ప్రతిపక్షాలు వికృతంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి....

ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి: సీఎం

రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులకు...

Topics

ఖేలో ఇండియా 2026కు వేదికగా హైదరాబాద్.. కేంద్రం సుముఖం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026...

ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులు వీరే.. సీఎం రేవంత్ గుడ్ న్యూస్ !

తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు...

హైదరాబాద్ – టర్కీల మధ్య నిజాం కాలం నుండే సత్సంబందాలు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో...

మన్నెగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదు.. మంత్రి కోమటి రెడ్డి సీరియస్

రాష్ట్రంలో ప్రతిపక్షాలు వికృతంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి....

ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి: సీఎం

రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులకు...

ఫుడ్ పాయిజన్.. మృత్యువుతో పోరాడి ఓడిన గిరిజన విద్యార్థి

మృత్యువే గెలిచింది.. దాదాపు 20 రోజులకుపైగా నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...

RGV: రాంగోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్దం! హైదరాబాద్ కు ఏపీ పోలీసులు

ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం...

పండుగ వాతావరణంలో ప్రజాపాలన విజయోత్సవాలు

డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రమంతా పండుగ...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img