Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్ తో బేటీ

సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ అగ్రనేతలను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలవనున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెల్లిన భట్టి, ఉత్తమ్ లతో కలిసి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పార్టీ అధినాయకత్వానికి తెలపనున్నారు. వరంగల్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ కాగానే వరంగల్ లోనే భారీ భహిరంగ సభ నిర్వహిచనున్నారు. ఈ సభకు రాహుల్ ను ఆహ్వానించనున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలు ఒకేసారి జరుగుతాయి కాబట్టి రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత బహిరగ సభకు ఒక తేదీని ఫిక్స్ చేయనున్నారు.

అధిష్టానంతో చర్చలు

మంత్రివర్గ విస్తరణతో పాటు, పీసీసీ అధ్యక్ష పదవి, నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధిష్టానంతో చర్చిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని నామినేటడ్ పదవుల నియామకం పూర్తి కాగా, మరికొన్నింటిపై కసరత్తు చేయనున్నారు. పదవులు దక్కని సీనియర్లను ఏవిధంగా గౌరవించాలనే దానిపై కూడా చర్చించనున్నారు.

కేబినెట్ లోకి వీరికి అవకాశం..!

నిజామాబాద్ నుండి సుదర్శన్, మహబూబ్ నగర్ నుండి వాకిటి శ్రీనివాస్ లేదా వీర్లపల్లి శంకర్ లలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని.. నల్గొండ నుండి బీర్ల అయిలయ్య, బాలు నాయక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలలో ఒకరికి ఛాన్స్ ఇస్తారని.. రంగారెడ్డి నుండి మల్ రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

కేంద్రమంత్రులతో భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని తెలస్తోంది. రాష్టానికి సంబందిచి పలు సమస్యలను కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

Share the post

Hot this week

AP CM: వరదబాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం: సీఎం చంద్రబాబు

ఏపీలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు...

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాణి కుముదిని...

Khairatabad Ganesh: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణనాథుడు

ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఎన్టీఆర్ మార్గ్ లోని...

Delhi CM: ఢిల్లీసీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా.. ముఖ్యమంత్రిగా అతిషి

ఢిల్లీ సీఎం (Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తన...

రాహుల్ గాంధీ నాలుక కోస్తే రూ.11 లక్షల నజరానా.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీపై మహారాష్ట్రలోని ఏక్...

Topics

కాంగ్రెస్, బీఆర్ఎస్ లు మజ్లిస్ పార్టీకి కొమ్ము కాస్తున్నాయి: కిషన్ రెడ్డి

తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా...

కొత్తగూడెంలో అగ్రి టెక్నాలజీస్ ఎక్స్ పో

వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పై కొత్తగూడెం ప్రకాశం స్టేడియం...

Sreeleela: లంగా ఓణీలో శ్రీలీల.. నెట్టింట ఆకట్టుకుంటున్న ఫోటోలు

టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల.. ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేని బ్యూటీ. ముఖ్యంగా తెలుగు...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img