అధికారులు ఉద్యోగుల సహకారంతో ఉద్యోగ బాధ్యతలను విజయవంతగా నిర్వర్తించానని సమాచారశాఖ సంయుక్త సంచాలకులు మహమ్మద్ ముర్తుజా తెలిపారు. ప్రస్తుతం జిహెచ్ఎంసి (GHMC)లో సంయుక్త సంచాలకుల హోదాలో సిపిఆర్ఓ (CPRO)గా విధులు నిర్వర్తిస్తున్న మహమ్మద్ ముర్తుజా శనివారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్బంగా హైదరాబాద్ రాష్ట్ర సమాచార శాఖా కార్యాలయంలో ఆ శాఖా అధికారులు ఉద్యోగుల ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయన మాట్లాడుతూ తన 31 ఏండ్ల ఉద్యోగ జీవితంలో సహాయ పౌర సంభంధాల అధికారి నుండి సంయుక్త సంచాలకుల వరకు వివిధ హోదాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలో పని చేశానన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లో చేరేవేసే క్రమంలో అటు అధికారులు ఇటు ఉద్యోగులను సమన్వయము చేసుకుంటూ పతాక ఫలాలను పెద్ద ప్రజలకు చేరవేయడం లో తన వంతు బాధ్యతను నిర్వహించనున్నారు. తన ఉద్యోగ బాధ్యతలో నిర్వహణలో సహకరించిన అధికారులు, సిబ్బంది , మీడియా ప్రతినిధులకు ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర సమాచార శాఖ అదనపు సంచాలకులు డి ఎస్ జగన్ మాట్లాడుతూ.. తనదైన పని తీరుతో ముర్తుజా సమాచార శాఖకు మంచి గుర్తింపుని తీసుకొచ్చారని కొనియాడారు. విధుల నిర్వహణలో క్షేత్రస్థాయిలో వచ్చే ఒత్తిడిని నేర్పుతో అధిగమించి సమర్ధవంతగా తన విధులు నిర్వహించారని కొనియాడారు. క్లిష్ట పరిస్థితుల్లో సిబ్బందికి అండగా వుంటూ మెరుగైన పనితీరు కనబర్చేలా వారిని ప్రోత్త్సహించారన్నారు. సమాచారశాఖకు సుదీర్ఘకాలం చేసిన సేవలు మరువలేనివని అయన నుంచి నేటితరం ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు.
సంయుక్త సంచాలకులు డి. శ్రీనివాస్ మాట్లాడుతూ పేద కుటుంబంలో జన్మించిన మహమ్మద్ ముర్తుజా ఎంతో కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకొని, ఎందరితో స్ఫూర్తిగా నిలబడ్డారని అన్నారు. ఉద్యోగ విధుల నిర్వహణలో తన సిబ్బందికి మార్గదర్శకం చేస్తూ వెన్నంటే ఉండేవారన్నారు. ఉద్యోగులను కుటుంబంగా భావించేవారని.. అధికారులు, ఉద్యోగులతో స్నేహబంధంతో మెదిలేవారని ప్రశంసించారు.