తెలంగాణలో ధనవంతమైన జిల్లాగా రంగారెడ్డి ఆవతరించింది. హైదరాబాద్ ను వెనక్కి నెట్టి అగ్ర స్థానానికి దూసుకెళ్లింది. తెలంగాణలో ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్న జిల్లాగా రంగారెడ్డి జిల్లా నిలిచింది.పర్ క్యాపిట ఇన్ కమ్ అధారంగా తెలంగాణలో రిచెస్ట్ జిల్లాగా రంగారెడ్డి తొలి స్థానంలో నిలవగా.. హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో సంగారెడ్డి ఉంది. నాలుగో స్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి, ఐదో స్థానంలో యాదాద్రి భువనగిరి, ఆరో స్థానంలో నల్గొండ, ఏడో స్థానంలో మహబూబ్ నగర్, ఎనిమిదో స్థానంలో మెదక్, తొమ్మిదో స్థానంలో భద్రాద్రి కొత్తగూడెం, పదో స్థానంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఓ నివేదిక విడుదల చేసింది. తెలంగాణ ఎకానమి 2023 పేరుతో నివేదికను విడుదల చేశారు.
రంగారెడ్డి జిల్లా పర్ క్యాపిట ఇన్ కమ్ రూ. 8.15 లక్షలకు పైగా ఉండగా.. హైదరాబాద్ పర్ క్యాపిట ఇన్ కమ్ కేవలం రూ. 4.03 లక్షలకు పైగా ఉంది.అలాగే, హైదరాబాద్ వాసుల కంటే రంగారెడ్డి జిల్లా వాసులే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఐటీ హబ్ కారణం గానే రంగారెడ్డి రిచెస్ట్ జిల్లాగా మారిందని నిపుణులు చెబుతున్నారు. జోన్ల వారీగా హైదరాబాద్ పశ్చిమ ప్రాంతం లోని ఐటీ హబ్ లు రంగారెడ్డి జిల్లా వైపు తరలి పోతున్నట్లు పేర్కొంటున్నారు. స్థూల జిల్లా దేశీయోత్పత్తి (జిడిడిపి) పరంగా కూడా, తెలంగాణ లోని జిల్లాల జాబితాలో హైదరాబాద్ రెండవ స్థానంలో ఉంది. జిల్లా తలసరి ప్రతి వ్యక్తి జిల్లాలో సంవత్సరానికి ఆర్జించే సగటు ఆదాయాన్ని ప్రతిబింబిస్తుంది.
రంగారెడ్డి – రూ. 8,15,996, హైదరాబాద్ – రూ. 4,03,214, సంగారెడ్డి – రూ. 3,08,166, మేడ్చల్-మల్కాజిగిరి – రూ. 2,58,040, యాదాద్రి భువనగిరి – రూ. 2,47,184, నల్గొండ – రూ. 2,42,103, మహబూబ్ నగర్ – రూ. 2,40,900, మెదక్ – రూ. 2,32,384, భద్రాద్రి కొత్తగూడెం – రూ. 2,28,582, జయశంకర్ – రూ. 2,23,481 కోట్లుగా ఉంది.
తలసరి ఆదాయం ఆధారంగా టాప్ 10 ధనిక రాష్ట్రాల జాబితా లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. సిక్కిం మొదటి స్థానంలో ఉండగా.. గోవా రెండో స్థానంలో ఉంది.