తన గొర్రెలు చేను మేయకున్నా.. నర్సాయపల్లికి చెందిన పోతుగంటి రమేష్ విపరీతంగా కొట్టాడని, చెట్టె సత్తయ్య ఇటీవలే మద్దూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. అయితే తనను రమేష్ విపరీతంగా కొట్టాడనే మనస్తాపంతో.. నొప్పులు భరించలేక బుధవారం సాయంత్రం చెట్టె సత్తయ్య పురుగుల మందు తాగాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సత్తయ్యని స్థానికులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి.. అక్కడినుండి సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. అయినా ఆరోగ్యం విషమించడంతో.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇంకా సత్తయ్య ఆరోగ్యంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని వైద్యులు అంటున్నారు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు కేసు రిజిష్టర్ అయి ఉన్న మద్దూరు పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ పురుగులమందు తాగిన కేసు తమ పరిధిలోకి రాదని… చేర్యాల పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలని సూచించారు. అయితే, కుటుంబ సభ్యులు అందరూ హైదరాబాద్ లో ఆస్పత్రి వద్ద ఉన్నారు. ఈ ఘటనకు కారణం అయిన నర్సాయపల్లికి చెందిన పోతుగంటి రమేష్ ను శిక్షించాలని.. గొర్రెల కాపరి సత్తయ్యకు న్యాయం చేయాలని గొర్రెల కాపరులు, కురుమ సంఘం నాయకులు పోలీసులను కోరుతున్నారు.