అన్నాచెల్లెలు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను దేశ ప్రజలంతా ఘనంగా నిర్వహించుకున్నారు. అక్కా చెల్లెళ్లు తమ అన్నాతమ్ముళ్లకు రాఖీలు కట్టారు. మహిళలు, చిన్నారులు, యువతులు, తమ సోదరులకు రాఖీలను కట్టి, స్వీట్లు తినిపించుకొని ఆనందాన్నిపంచుకున్నారు. చాలా మంది సుదూర ప్రాంతాలకు వెళ్లి తమ సోదరులకు రాఖీలు కట్టారు. తమ ఇంటి ఆడ బిడ్డ పుట్టింటికి రావడంతో కుంటుంబ సభ్యులంతా కలిసి మెలిసి వేడుకను జరుపుకున్నారు.