బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డి నేతృత్వంలో మహిళలు బిజెపి నాయకులకు రాఖీ కట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ తివారి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, మాజీ శాసనమండలి బిజెపి పక్ష నాయకులు ఎన్ రామచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.