NewsTelanganaరికార్డు స్థాయిలో తెలంగాణకు రైల్వే బడ్జెట్ కేటాయింపులు : కేంద్రమంత్రి కిషన్...

రికార్డు స్థాయిలో తెలంగాణకు రైల్వే బడ్జెట్ కేటాయింపులు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

-

- Advertisment -spot_img

గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం రైల్వేల పరంగా గణనీయమైన వృద్ధిని సాధిస్తూ వస్తోన్న విషయం మనందరికీ తెలిసిందే. బడ్జెట్ కేటాయింపులు మొదలుకొని, నూతన రైల్వేట్రాక్ ల నిర్మాణం, విద్యుద్ధీకరణ, రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, నూతన రైల్వేస్టేషన్ల ఏర్పాటు, సిద్ధిపేట,మెదక్ నూతన రైల్వే లైన్ల ప్రారంభం, చర్లపల్లి నూతన టెర్మినల్ నిర్మాణం వంటి ఎన్నో అంశాలలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబరిచి రాష్ట్రంలో రైల్వేలు పురోగతి సాధించడంలో కీలకమైన పాత్రను పోషించింది.

గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల నరేంద్రమోదీ ప్రభుత్వం చూపిస్తున్న ప్రత్యేకమైన శ్రద్ధకు కొనసాగింపుగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా రైల్వేల అభివృద్ధికి రూ. 5,336 కోట్ల నిధులు కేటాయించింది. ఈ నిధులు 2014-15 బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే దాదాపు 21 రెట్లు ఎక్కువ. అదే 2009-14 మధ్యన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు కేటాయింపులతో పోలిస్తే 6 రెట్ల కంటే ఎక్కువ.

తెలంగాణ రాష్ట్రానికి పెద్దమొత్తంలో నిధులను కేటాయించడమే కాకుండా అంతే రీతిలో రాష్ట్రంలో నూతన రైల్వే ట్రాక్ ల నిర్మాణాన్ని కూడా చేపట్టింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 32,946 కోట్ల విలువైన నూతన రైల్వే ట్రాక్ ల ప్రాజెక్టులు నిర్మాణం జరుపుకుంటున్నాయి. గతంలో 2009-14 మధ్యన సంవత్సరానికి సగటున 17 కి. మీ. ల నూతన రైల్వే ట్రాక్ ల నిర్మాణం జరగగా, గత 10 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి సగటున 65 కి. మీ. ల నూతన రైల్వే ట్రాక్ ల నిర్మాణం జరిగింది. వీటితో పాటుగా అనేక నూతన రైల్వే మార్గాలకు సంబంధించిన, డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ ప్రాజెక్టులు ఫైనల్ లొకేషన్ సర్వేను జరుపుకుంటున్నాయి.

నూతన రైల్వే ట్రాక్ లను నిర్మించడమే కాకుండా, నిర్మించిన రైల్వే ట్రాక్ ల విద్యుద్ధీకరణపై కూడా రైల్వే శాఖ ప్రత్యేక శ్రద్ధను కనబరచింది. తద్వారా నేడు తెలంగాణ రాష్ట్రంలో 100% రైల్వేల విద్యుద్ధీకరణ సాధ్యమయ్యింది. నూతన రైల్వే ట్రాక్ ల నిర్మాణం, విద్యుద్ధీకరణతో పాటుగా రక్షణ పరంగా కూడా రైల్వేశాఖ గట్టి చర్యలు చేపట్టింది. గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 437 రైల్ ఓవర్ బ్రిడ్జ్ & రైల్ అండర్ బ్రిడ్జ్ ల నిర్మాణం జరిగింది.

వీటితోపాటుగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించనున్నారు. వీటికి సంబంధించిన నిధుల కేటాయింపు జరగడమే కాకుండా ఆయా రైల్వేస్టేషన్లలో పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి.
ఆయా రైల్వేస్టేషన్ల వివరాలు:అదిలాబాద్, బాసర, బేగంపేట, భద్రాచలం రోడ్డు, గద్వాల, హఫీజ్ పేట, హైటెక్ సిటీ, హుప్పు గూడ, హైదరాబాద్, జడ్చర్ల, జనగామ, కాచిగూడ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట్ జంక్షన్, ఖమ్మం, లింగంపల్లి, మధిర, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మలక్ పేట, మల్కాజ్ గిరి, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మిర్యాలగూడ, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రామగుండం, సికింద్రాబాద్, షాద్ నగర్, శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగుళాంబ, తాండూర్, ఉందానగర్, వికారాబాద్, వరంగల్, యాదాద్రి, యాకుత్ పుర, జహీరాబాద్ రైల్వేస్టేషన్లు.

వీటితోపాటుగా హైదరాబాద్ లోని ప్రధాన రైల్వేస్టేషన్లపై ఒత్తిడిని తగ్గించడానికి చర్లపల్లిలో నిర్మిస్తున్న నూతన టెర్మినల్ పనులు 99% పూర్తి అయ్యాయి. త్వరలోనే చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం కానుంది. అలాగే, రూ. 715 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని తలపెట్టిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు కూడా చాలా వేగంగా కొనసాగుతున్నాయి.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
- Advertisement -spot_imgspot_img

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన...

రాగ‌ల 72 గంట‌ల్లో.. కేటీఆర్ Vs మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్..!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం అటు సవాళ్లు, ఇటు ప్రతిసవాళ్లతో అట్టుడుకుతోంది. రాగ‌ల 72 గంటల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you