కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మేదిగడ్డ బ్యారేజ్ ని సందర్శించారు. అనంతరం హెలికాప్టర్ లోనుండి కుంగిన పిల్లర్లను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ వద్దకు చెనుకున్నాయి. అయితే 144 సెక్షన్ అమలులో ఉంది కాబట్టి అనుమతి లేదని పోలీసులు కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి పోలీసులను, బారికేడ్లను తోసుకుని వెళ్లారు.
అంతకు ముందు అంబటిపల్లి మహిళా కాంగ్రెస్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అధికార బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. లక్ష కోట్ల ప్రజాదన్నాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దోచుకున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ గొప్పగా ప్రచారం చేసుకుందని.. ఇప్పుడు ప్రాజెక్టు పిల్లర్లు కుంగడంతో వారి అవినీతి బయట పడిందని రాహుల్ గాంధీ విమర్శించారు.