ములుగు కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జరిగే ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మద్య జరుగబోతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రధానంగా కాంగ్రెస్-బీఆర్ఎస్ మద్యే పోటీ ఉంటుందని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ఉనికి నామమాత్రమేనని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గతంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే నమ్మకం అని అన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీకి నష్టం వస్తుందని తెలిసినా.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామని రాహుల్ గుర్తు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మేడారం జాతరను జాతీయ పండుగా చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నామని.. ఆరు గ్యారంటీలు ప్రజలకు అందిస్తామని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.
LIVE: Public Meeting | Mulugu, Telangana https://t.co/l5FozKrWjk
— Rahul Gandhi (@RahulGandhi) October 18, 2023