...

Gaddar last song: మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో.. ఆ తుపాకులకు ఎదురు నడిసిన తూట ఎవరు దాచెదరో..

ప్రజాయుద్ద నౌక, జానపద, విప్లవ వాగ్గేయకారుడు గుమ్మడి విఠల్ రావు అలియాస్ గద్థర్ అంత్యక్రియలు వేలాదిగా తరలి వచ్చిన ప్రజల సమక్షంలో బౌద్దమత పద్దతిలో అల్వాల్ లోని భూదేవి నగర్ లో సోమవారం సాయంత్రం జరిగాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో మహా బోధి విద్యాలయ స్కూల్ లో గద్ధర్ అంత్యక్రియలు ముగిశాయి.

గద్దర్ గత కొద్ది రోజులుగా అనారోగ్య కారణాలతో అమీర్ పేట లోని అపోలో స్పెక్ట్రా హస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతూ ఆదివారం రోజు తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో కవులు, కళాకారులు, అభిమానులు, అన్ని వర్గాల ప్రజలు అందరూ షాక్ కు గురయ్యారు.

ఆదివారం సాయంత్రం ఆసుపత్రి నుండి ప్రజల సందర్శనార్దం ఎల్బీ స్టేడియంలో గద్దర్ పార్థీవ దేహాన్నిఉంచారు. అక్కడికి వేలాదిగా ప్రజలు తరలి వచ్చి నివాళులు అర్పించారు. వివిధ పార్టీల నేతలు, అభిమానులు, ఉన్నతాధికారులు గద్థర్ కు నివాళులు అర్పించారు. అనంతరం వారు గద్దర్ తో ఉన్న అనుబంధాన్ని గర్తు చేసుకుంటూ.. గద్థర్ పేద ప్రజల పక్షన, అనచి వేతకు వ్యతిరేఖంగా చేసిన పోరాటాలను గర్తు చేసుకొని కన్నీటి పర్యంతం అయ్యారు. వందలాదిగా తరలి వచ్చిన కళాకారులు పాటలు పాడుతూ గద్దర్ కు పాటలతో కన్నీటి నివాళి అర్పించారు. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి గద్ధర్ కు నివాళులు అర్పిస్తూ సందేశాన్ని పంపారు.

ఎల్బీ స్టేడియం నుండి ప్రారంభం అయిన గద్దర్ అంతిమ యాత్ర సుమారు ఆరున్నర్ గంటల పాటు సాగి అల్వాల్ లోని భూదేవి నగర్ లో ఉన్న గద్దర్ నివాసానికి చేరుకుంది. గద్దర్ ను కడసారి చూసేందుకు వేలాదిగా ప్రజలు గద్దర్ నివాసం వద్దకు చేరుకున్నారు. గద్దర్ అంతిమ యాత్ర వాహనం రాగానే గద్దర్ ను చూసేందుకు పోలీసులు బారికేడ్లు తోసుకొని ఒక్కసారిగా జనం వచ్చారు. వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేయవలసి వచ్చింది అంటే.. ఎంత మంది గద్దర్ ను కడసారి చూసేందుకు వచ్చారో అర్ధం అవుతోంది. పలువురు గద్దర్ బంధువులు, రాజకీయ నాయకులు ఆయన నివాసానికి వచ్చి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గద్దర్ నివాసానికి వచ్చి ఆయన పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం గద్దర్ ఇంటి నుండి దగ్గరలో ఉన్న మహాభోధి విద్యాలయ స్కూల్ వరకు గద్దర్ ను పాడెపై మోసుకోని తీసుకు వచ్చారు. పోలీసులు గౌరవ వందనం చేసి, గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. గద్థర్ అంతిమ సంస్కారాలు బౌద్ధమత సాంప్రదాయం ప్రకారం నిర్వహంచారు.

గద్దర్ అంతిమ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. గద్దర్ అంతమ యాత్ర ఎల్బీ స్టేడియం నుండి అల్వాల్ వరకు కొనసాగతుండగా.. ఆయన మిత్రుడు, సీనియర్ జర్నలిస్ట్, సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరద్దీన్ అలీఖాన్ కార్డియాక్ అరెస్ట్ తో తీవ్ర గుండె పోటుతో కుప్పకులాడు. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జహీరద్దీన్ మరణించారని వైద్యులు తెలిపారు. ఆమన మరణంతో మరింత విషాదం నెలకొంది.

Share the post

Hot this week

వరద బాధితులకు యశోద హాస్పిటల్ గ్రూప్స్ కోటి రూపాయల విరాళం

భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకులం అయిన నేపథ్యంలో యశోద గ్రూప్ హాస్పిటల్స్...

Pension: ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తే పెన్షన్ కట్.. హిమాచల్ ప్రభుత్వం సంచలనం

హిమచల్ ప్రదేశ్ శాసనసభలో సభ్యుల పెన్షన్లు, అలవెన్సులు సవరణ బిల్లు-2024ను ముఖ్యమంత్రి...

డీజీపీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం తెలంగాణ...

4-day workweek: ఇక వారానికి నాలుగు రోజులే పనిదినాలు.. ప్రభుత్వం సుముఖత

ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులు ఐదు రోజులు పనిచేసే సంస్కృతి...

Topics

వరద బాధితులకు యశోద హాస్పిటల్ గ్రూప్స్ కోటి రూపాయల విరాళం

భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకులం అయిన నేపథ్యంలో యశోద గ్రూప్ హాస్పిటల్స్...

Pension: ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తే పెన్షన్ కట్.. హిమాచల్ ప్రభుత్వం సంచలనం

హిమచల్ ప్రదేశ్ శాసనసభలో సభ్యుల పెన్షన్లు, అలవెన్సులు సవరణ బిల్లు-2024ను ముఖ్యమంత్రి...

డీజీపీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం తెలంగాణ...

4-day workweek: ఇక వారానికి నాలుగు రోజులే పనిదినాలు.. ప్రభుత్వం సుముఖత

ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులు ఐదు రోజులు పనిచేసే సంస్కృతి...

BJP Membership Drive: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని

భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ సభ్యత్వ నమోదు (National Membership...

భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. వాగుల వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి సీతక్క

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు స్వీయ రక్షణ పాటిస్తూ అప్రమత్తంగా అప్రమత్తంగా...
spot_img

Related Articles