దశాబ్దాల నిరీక్షణకు తెర.. జూనియర్ అసిస్టెంట్ లకు ఈవోలుగా పదోన్నతి

సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. పదోన్నతి కోసం దాదాపు మూడు దశాబ్దాలుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసిన జూనియర్ అసిస్టెంట్స్ కు గ్రేడ్ 3 ఈవోలుగా దేవాదాయ శాఖ ప్రమోషన్ కల్పించింది. జీవో 134 ద్వారా మొత్తం 33 మంది జూనియర్ అసిస్టెంట్ లు ఈవోలుగా పదోన్నతి పొందటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీవ్ర అణచివేతకు గురైన తమకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో న్యాయం లభించిందని ఉద్యోగులు భావోద్వేగానికి గురైన సన్నివేశాలకు నేడు తెలంగాణ సెక్రటేరియట్ వేదికగా నిలిచింది. తమకు దసరా పండుగ వారం రోజులు ముందుగానే వచ్చిందని వారు అమితానందాన్ని వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా వీరంతా ప్రమోషన్ పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన ఈవోలు మంత్రి సురేఖని సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. నేడు 33 మంది జూనియర్ అసిస్టెంట్లకు గ్రేడ్ 3 ఈవోలుగా తన చేతుల మీదుగా ప్రమోషన్ పత్రాలు అందివ్వడం చాలా ఆనందంగా వుందని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఒక సంతకంతో వారికి ప్రమోషన్లు కల్పించేందుకు కూడా గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులను తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని అన్నారు. ఉద్యోగులకు సంబంధించిన ప్రమోషన్స్ అనేవి సాధారణ ప్రక్రియలో భాగమనీ, అటువంటి ప్రమోషన్స్ ను కూడా చేపట్టకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులను మానసికంగా హింసించిందని ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజలకు, ఉద్యోగులకు సంబంధించిన ఏ సమస్యనైనా త్వరిత కాలంలోనే పరిష్కరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. నాడే వారికి ప్రమోషన్స్ వచ్చుంటే వారి సేవలతో దేవాదాయ శాఖ మరింత బలోపేతమయ్యేదనీ, పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభించేదని అన్నారు. ఇప్పటికే గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఈవోలుగా పలువురికి ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. కొత్త ఈవోలుగా బాధ్యతలు చేపట్టిన ఉద్యోగులు దేవాలయాల అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి సూచించారు.

దేవాదాయ శాఖ భూముల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి, దేవాదాయ భూములకు జీయో ట్యాగింగ్ వంటి నిర్ణయాలతో దేవాదాయ శాఖ ఆస్తులకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కట్టుదిట్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నదని అన్నారు. కోర్టు కేసుల్లో వున్న దేవాలయ భూములకు విముక్తి ప్రసాదించేందుకు దేవాదాయ శాఖ లీగల్ ఆఫీసర్ ను నియమించనుందని మంత్రి తెలిపారు.

మంత్రిని ఉద్వేగంతో హత్తుకున్న పదోన్నతి పొందిన ఈవో కూతురు


తన తండ్రి ప్రమోషన కోసం యావత్ కుటుంబం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూసిందని పదోన్నతి పొందిన ఎఓ ఈవో కూతురు అన్నారు. గత పదేళ్ళుగా తన తండ్రికి ఎప్పుడు ప్రమోషన్ వస్తుందా అంటూ ప్రతి రోజు అడిగేదానన్ని అన్నారు. దశాబ్దాలుగా వేచి చూస్తున్న తన తండ్రికి మీ హయాంలో ప్రమోషన్ రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందంటూ భావోద్వేగంతో మంత్రి సురేఖను హత్తుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ ఆమెను భుజం తట్టారు. ఇక నుంచి ఆలయ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తరఫున చేయాల్సిన కార్యక్రమాలను నిబద్ధతతో చేపడతామని స్పష్టం చేశారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

హ‌క్కుల ర‌క్ష‌ణ కోసం ద‌క్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి: సీఎం రేవంత్

ఒకే దేశం.. ఒకే ఎన్నిక నిజానికి ఒకే వ్య‌క్తి.. ఒకే పార్టీ...

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో ప్రభావం చూపుతాయా..?

ఢిల్లీలో దాదాపు 27 సంవత్సరాల తరువాత బీజేపీ విజయబావుటా ఎగురవేసింది. డిల్లీలో...

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి దామోదర

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య,...

Prajavani: ప్రజావాణికి 4901 దరఖాస్తులు

హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన...

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

Topics

హ‌క్కుల ర‌క్ష‌ణ కోసం ద‌క్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి: సీఎం రేవంత్

ఒకే దేశం.. ఒకే ఎన్నిక నిజానికి ఒకే వ్య‌క్తి.. ఒకే పార్టీ...

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో ప్రభావం చూపుతాయా..?

ఢిల్లీలో దాదాపు 27 సంవత్సరాల తరువాత బీజేపీ విజయబావుటా ఎగురవేసింది. డిల్లీలో...

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి దామోదర

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య,...

Prajavani: ప్రజావాణికి 4901 దరఖాస్తులు

హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన...

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి: పొంగులేటి

తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో...

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ...

ముగిసిన సీఎం సింగపూర్​ పర్యటన.. దావోస్ కు రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img