టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం, సీనియర్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్‌లు శుక్రవరం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మల్సీలుగా ప్రభుత్వం సూచించడంతో.. కోదండరాం, అలీ ఖాన్‌లతో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఇతర నేతలు హాజరయ్యారు. తాను ఎమ్మెల్సీ కావడానికి సహకరించిన అందరికీ ఎమ్మెల్సీ కోదండరాం ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ కావడంతో తనపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. అమరుల ఆకాంక్షలు నెరవేర్చడానికి తన వంతు కృషి చేస్తానని కోదండరాం పేర్కొన్నారు.