తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ అర్చక ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డి.వి.అర్ శర్మ, జనరల్ సెక్రెటరీ ఆనంద్ శర్మ, తెలంగాణ ప్రభుత్వ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కోడూరు శ్రీనివాస్ రావులు ముఖ్యమత్రిని కలిశారు. ఈ సందర్బంగా సీఎం దృష్టికి అర్చక ఉద్యోగుల సమస్యలు తీసుకెళ్లారు.
దేవాదాయధర్మాదాయ శాఖ తెలంగాణలో అర్చకుల బదిలీలు చెయ్యకూడదని దేవాదాయ చట్టం, ఆగమాలు మాత్రమే కాకుండా స్థానికంగా ప్రతి దేవాలయంలో ఆచారాలు, పద్ధతులు ఉంటాయని భగవంతునికి భక్తునికి అనుసందానకర్థలు అర్చకులు అని.. వారు ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్నారు కాబట్టి బదిలీలు చెయ్యకూడదని ముఖ్యమంత్రికి విన్నవించడం జరిగింది. అర్చక సమస్యలపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి తక్షణం అర్చక బదిలీలను నిలిపివేయాలని సెక్రటరీ శేషాద్రి కి ఆదేశాలు ఇచ్చారు.
దేవాదాయ శాఖ లో 5 సంవత్సరాలకు పైగా పనీ చేస్తున్న అర్చక ఉద్యోగులను రెగ్యులర్ చెయ్యడం, ఒకే శాఖ ఒకే వేతన విధానంలో భాగంగా అర్చక ఉద్యోగులకు ఈ ఏ ఎఫ్ ద్వారా వేతనాలు అందించడం, 65 సంవత్సరాల వరకు సేవలందించిన అర్చకులకు, 61 సంవత్సరాలు సేవలు చేసిన సిబ్బందికి ప్రస్తుతం 2 లక్షల రూపాయలు మాత్రమే పదవి విరమణ సందర్భంగా దేవాదాయ శాఖ చెల్లిస్తుంది. కనీస పెంక్షన్ అమలు చెయ్యాలని, దేవాదాయ శాఖ సంబంధించిన బూముల రక్షణకు రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చెయ్యాలని దేవాలయ సిబ్బంది కి ఈఓ ల ప్రమోషన్స్ త్వరితగతిన చేపట్టాలని సీఎం గారిని కోరడం జరిగింది. అర్చక ఉద్యోగులకు కూడా ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి హెల్త్ కార్డులు అందచేయాలని కోరడం జరిగింది. ముఖ్యమంత్రి అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన సందర్భంగా డి.వి ఆర్ శర్మ, అనంద్ శర్మలు దైవ ప్రసాదాన్ని, శేషవస్త్రలు అందచేసి ఆశీర్వచనం చేసి, ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేశారు.