Wednesday, March 26, 2025
HomeNewsTelanganaమోడీకి జై.. కిషన్ రెడ్డికి నై.. తెలంగాణ సీఎం రేవంత్ కొత్త స్ట్రాటజి !

మోడీకి జై.. కిషన్ రెడ్డికి నై.. తెలంగాణ సీఎం రేవంత్ కొత్త స్ట్రాటజి !

తెలంగాణ సీఎం రేవంత్ వ్యూహంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా వ్యవహరిస్తున్నారా? తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారా రాష్ట్రంలో బీజేపీపై ఎందుకు ఒంటికాలిపై లేస్తున్నారు? రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై ఎందుకు విమర్శలు పెంచారు? ఏదైనా వ్యూహంలో భాగంగానే విమర్శల డోస్ పెంచారా? అనేది రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తిగా మారింది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయింది. ఏడాది నుండి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సఖ్యతగానే వ్యవహరిస్తోంది. మోడీ రాష్ట్రానికి పెద్దన్న అని రేవంత్ రడ్డి గతంలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ లైన్ మినహా.. ప్రభుత్వాల విషయంలో సామరస్యంగానే ఉంటున్నారు. సమాఖ్య వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు ఇది మంచి పరిణామమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

సీఎం రేవంత్ రెడ్డి గత కొన్నిరోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కిషన్ రెడ్డి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు. రాష్ట్రానికి మెట్రో రైలు ప్రజెక్టు విస్తరణ, ట్రిపుల్ ఆర్ పనుల జాప్యం, మూసీ ప్రక్షాళన, ఫోర్త్ సిటీ వంటి ప్రాజెక్టులకు నిధులు కాకుండా కిషన్ రెడ్డి కావాలనే అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా ఒక అడుగు ముందుకు వేసి రాష్ట్ర అభివృద్ధికి కిషన్ రెడ్డి సైంధవ పాత్ర పోషిస్తున్నారని విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ ప్రాజెక్టుల పట్ల సానుకూలంగా ఉన్నా.. వటిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కేబినెట్ లో చర్చకు రాకుండా అడ్డుపడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఒకవేళ తెలంగాణ అభివృద్ధి చెందితే.. తనకంటే చిన్నవాడైన రేవంత్ రెడ్డికి పేరు వస్తుందని కిషన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు. దీనికి కారణం కిషన్ రెడ్డి మిత్రుడు కేసీఆర్ పార్టీ ఓడిపోవడంతో కిషన్ రెడ్డి కోపంతో ఇదంతా చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలకు పదును పెడుతున్నారు.

కేంద్రప్రభుత్వాన్ని విమర్శించకుండా కేవలం రాష్ట్ర బీజేపీనే విమర్శించడం వెనక రేవంత్ రెడ్డి స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒక వైపు తెలంగాణలో బీజేపీని ఎక్కడికక్కడ కట్టడి చేయడం… మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుండి పథకాలు, నిధులు వచ్చేలా చూసుకోవడంలో భాగంగానే మోడీని పొగడడంలో భాగమని అనే చర్చ నడుస్తోంది. ఇలా చేయడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు రేవంత్ ముందుకు వెళ్తున్నారని అంటున్నారు పొలిటికల్ ఎక్స్ పర్ట్స్.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments