ప్రధాని నరేంద్ర మోడీ రేపు ( మార్చి 15) తెలంగాణలో ఎన్నికల పర్యటనకు రానున్నారు. 15,16,18 తేదీలలో మూడు రోజులపాటు పలు నియోజక వర్గాల్లో ప్రధాని మోడీ రోడ్ షో, బహిరంగ సభలకు బీజేపీ పార్టీ సిద్దం అవుతోంది. 15న సాయంత్రం 5 :15 నుండి 6 :15 వరకు మల్కాజ్ గిరిలో రోడ్ షోలో పాల్గొటారు. మిర్జాల్ గూడా క్రాస్ రోడ్ నుండి మల్కాజ్ గిరి క్రాస్ రోడ్ వరకు దాదాపు 1.2 కి.మీ. గంటన్నరసే పు భారీ రోడ్ షో ఉంటుందని బీజేపీ నేతలు అంటున్నారు. రోడ్ షోలో ప్రధాని పాల్గొంటారు. రాత్రి రాజ్ భవన్ లోనే బస చేస్తారు. 16వ తేదీ ఉదయం నాగర్ కర్నూల్ లో మద్యాహ్నం 12: 00 నుండి 12: 45 వరకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అదేరోజు ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. తిరిగి 18వ తేదీన జగిత్యాలలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారని బీజేపీ నేతలు చెప్తున్నారు.