వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై కేఏ పాల్ స్పందించారు. రాజశేఖర్ రెడ్డి తనకు పరిచయం గనక వారి ఆత్మతో కమ్యూనికేట్ చేయటానికి ప్రయత్నించానని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజరెడ్డి, రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికుంటే షర్మిలని ఏ విధంగా అడ్డుకునే వారో తనకు అర్థమైందని అన్నారు. రాజకీయాలు అంటేనే అతి దరిద్రం అని, అసలు ఇంత దరిద్రమైన రాజకీయాలు 200 దేశాల్లో తాను ఎక్కడా చూడలేదని కెఎ పాల్ అన్నారు.