టీపీసీసీ లీగల్ సెల్, హ్యూమన్ రైట్స్, ఆర్.టి.ఐ చైర్మన్ గా తనను నియమించినందుకు ఏఐసీసీ, టీపీసీసీ నాయకత్వానికి పొన్నం అశోక్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్శి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కార్యదర్శులు రోహిత్ చౌదరీ, విష్ణు నాథ్, రాష్ట్ర మంత్రులు, జాతీయ కార్యదర్శి విపుల్ మహేశ్వరి తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.