పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో పాటు గంజాయి అక్రమ రవాణాను నియంత్రించేందుకు మల్టీ జోన్ 1 పరిధిలో 16 జిల్లాల్లో పోలీసులు, ప్రధాన రోడ్డు మార్గాల్లో వాహన తనిఖీలతో పాటు రైళ్ళల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.
ముఖ్యంగా త్వరలో జరగబోవు పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించడంతో పాటు యువత భవిష్యత్తు అంధకారం చేస్తున్న అక్రమ గంజాయి రవాణా, విక్రయాలపై కట్టడి చేయాలనే లక్ష్యంగా మల్టీ జోన్ 1 ఐ. జీ ఎ. వి. రంగనాథ్ ఆదేశాల మేరకు మల్టీ జోన్ 1 పరిధిలోని 16జిల్లాల్లో పోలీస్ అధికారులు, సిబ్బందిని సమీకరించి నిన్నటి సాయంత్రం 5గంటల నుండి నేటి సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు తమ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు. మల్టీ జోన్ 1 పరిధిలో చేపట్టిన పోలీసులు నిర్వహించిన 24 గంటల ఈ వాహన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న డబ్బుతో పాటు, మద్యం, గంజాయి భారీగా పట్టుబడటం జరిగిందని… ఈ తనిఖీల్లో సుమారు 2,81,36,128/- రూపాయల నగదు, 4,05,823/- రూపాయల విలువగల మద్యం సీసాలు, 3,15,788/- రూపాయల విలువలైన 15.479 కిలోగ్రామ్స్ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు 15 కేసులు నమోదు చేసి గంజాయిని అక్రంగా తలిస్తున్న 25 వ్యక్తులతో పాటు, 8 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకుగాను మల్టీ జోన్ 1 పరిధిలో ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతోందని. ఎవరైనా ఎన్నికల నియమ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని మల్టీ జోన్ 1 ఐ.జీ తెలిపారు.