తెలంగాణలో ఎవరు అధికారంలో ఉండాలన్నది ప్రజలే నిర్ణయిస్తారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మంగళవారం మరోసారి తెలంగాణలో ప్రధాని పర్యటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడే అలవాటు బీజేపీ పార్టీకి ఉందని అన్నారు. ఇది రాజరీకం కాదు.. ప్రజాస్వామ్యం అని అన్నారు. తెలంగాణ ప్రజలారా నాపై ఐదేళ్లపాటు నమ్మకం ఉంచండి. తెలంగాణలో జరుగుతున్న అవినీతి గురించి మీ పాదాల ముందుంచుతాను అని మోడీ అన్నారు. అలాగే కాంగ్రెస్ వాళ్లు చెప్పే వాగ్ధానాలను నమ్మకండి అని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీకి వచ్చి తనను కలిశారని, శాలువాలు, పూలమాలలతో సత్కరించి ఇక తెలంగాణలో బాధ్యతలను తన కుమారుడు కేటీఆర్ కు అప్పగిస్తానని.. తమను ఎన్డీఏలో చేర్చుకోవాలని అభ్యర్థించారని ప్రధాని సంచలన కామెంట్లు చేశారు. తాను అందుకు ఒప్పుకోలేదని మోడీ అన్నారు.
తెలంగాణలో కుటుంబ పాలనపై మోడి మండిపడ్డారు. కేసీఆర్, ఆయన కుమాడు, కూతురు, అల్లుడు తెలంగాణలో హవా కొనసాగిస్తున్నారని అన్నారు. కేసీఆర్ పాలనలో అంతా అవినీతి పెరిగిపోయిందన్నారు. నిజామాబాద్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన తర్వాత ప్రధాన నరేంద్ర మోడీ బహిరంగ సభలో మాట్లాడారు. తెలుగులో భారత్ మాతాకీ జై అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు మోడీ. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. త్వరలో దేశంలో అన్ని రైల్వేలైన్‌లను విద్యుదీకరణ చేస్తామని అన్నారు. ఆయుష్మాన్ భారత్, జన ఔషద్ కేంద్రాలు ప్రారంభించామన్నారు. బీబీనగర్ ఎయిమ్స్‌ను అత్యాధునికరంగా తీర్చి దిద్దుతామని అన్నారు. తమ ప్రభుత్వం శంకుస్థాపనలో కాదు.. వాటిని పూర్తి చేసుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నిజామాబాద్‌లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మోడీ.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. త్వరలో ఎన్టీపీసీ రెండో యూనిట్ ను ప్రారంభిస్తామని అన్నారు.