భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యలయంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. లక్ష్మణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా ఆయన దేశ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పించిన 2047-వికసిత్ భారత్ కలను సాకారం చేసుకోవాలని ఆయన ప్రార్థించారు. “మా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోని శక్తివంతమైన, అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్న సంకల్పంతో పని చేస్తున్నారు. ఆ సంకల్పం నెరవేరాలని నేను కోరుకుంటున్నాను” అని అన్నారు. వరదల భారినుండి రెండు తెలుగు రాష్ట్రాలు త్వరాగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వ బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, నష్టాన్ని అంచనా వేసి, బాధితులకు అండగా నిలిచేందుకు తగిన చర్యలు తీసుకుంటుంది అని తెలిపారు.