ప్రధాని మోడీ తెలంగాణపై వారాల జల్లు కురిపించారు 13,500 కోట్లతో పలి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మహబూబ్ నగర్ లో పర్యటించిన ఆయన 1932 కోట్లతో కృష్ణపట్నం-హైదరాబాద్ మల్టీ ప్రోడక్ట్ పైప్‌లైన్ తోపాటు, వరంగల్- ఖమ్మం- విజయవాడ హైవేవ్రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రజలు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న హామీలు ప్రధాని ప్రకటించారు. పసుపు రైతుల కోసం జాతీయ పసుపు బోర్డు (National Turmeric Board) ఏర్పాటు చేస్తున్నామని మోడి పాలమూరులో ప్రకటించారు. అదే విధంగా, ములుగు జిల్లాకు గిరిజన విశ్వవిద్యాలయాన్ని కూడా ప్రకటించారు. 900 కోట్లతో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని (sammakka sarakka national tribal University) ఏర్పాటు చేయనున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ప్రధాని మోడీ ప్రకటించారు.